Monday, 2 November 2026

ఎపిలో మారుతున్న రాజకీయ సవిూకరణాలు

బిజెపి,వైకాపా,జనసేనల వ్యూహాలు

చంద్రబాబు లక్ష్యంగా ముప్పేట దాడి

అమరావతి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఎపిలో ఇప్పుడు చంద్రబాబును టార్గెట్‌ చేసుకోవడమే లక్ష్యంగా రాజకీయ విన్యాసాలు సాగుతున్నాయి. ఎపిలో టిడిపికి ఇప్పుడు మిత్రులంటూ ఎవరు లేరు. బిజెపిపై యుద్దం ప్రకటించిన బాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఎపిలో మాత్రం జనసేన, బిజెపి, వైకపాలు బాటు లక్ష్యంగా యుద్దం చేస్తున్నాయి. టిడిపిని ఎలా ఓడించాలా అనే విషయంపై అన్ని పార్టీలు రాజకీయంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎవరు ఎవరిని ఎందుకు కలుస్తున్నా అందరి లక్ష్యం మాత్రం చంద్రబాబు అన్నట్టుగా ఉంటోంది. బిజెపిని బాబు దూరం చేసుకున్నందున బిజెపి కూడా ఇక ఎపిలో పాగా వేయడమెలా అన్న రీతిలో ముందుకు సాగుతోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా బిజెపి పెద్దలు పావులు కదపడం మొదలుపెట్టారు. ప్రత్యేక¬దా కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలలో నరేంద్ర మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఆయనను టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితులలోనూ చంద్రబాబు మళ్లీ గెలవకుండా బిజెపి పావులు కదుపుతోంది. జివిఎల్‌ నరసింహారావు,రాంమాధవ్‌ వంటి వారు ఈ విషయంలో చురుకుగా పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతంగా బిజెపి నేరుగా విమర్శలకు దిగుతోంది. ఐటి దాడులతో బాబును ఉక్కిరిబిక్కిరి చేయిస్తోంది. ఈ దశలోఎ చంద్రబాబు కూడా కేంద్రం లక్ష్యంగా విమర్శలకు పదుపు పెట్టారు. వీలు చికకినప్పుడాల్లా కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. వైకాపా రాజకీయ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు ఎన్‌డిఎ నుంచి బయటకు రావడం, బిజెపితో వైరం పెంచుకోవడంతో తనకుతానుగా శతృవులను పెంచుకున్నారు. ఇంతకాలం వైకాపా మాత్రమే శతృపక్షంలో ఉండేది. ఇప్పుడు జగన్‌, జనసేన, బిజెపితో పాటు లెఫ్ట్‌ పార్టీలు కూడా చేరాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒకవైపు మిగతా వారంతా ఒకవైపు అన్న రీతిలో ఎపి పాలిటిక్స్‌ సాగుతున్నాయి. ప్రత్యేక¬దా, ప్రత్యేక ప్యాకేజీ, అమరావతి, పోలవరం ఇలా అనేక విషయాల్లో రాజకీయంగా చంద్రబాబుకు అందరూ శత్రువులుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే స్థానిక బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిపై తీవ్రాతితీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ పార్టీ అన్నాక అధికారంలోకి రావడమే లక్ష్యం కనుక బిజెపి కూడా గట్టిగానే ముందుకు సాగుతోంది. వైకాపాను అధికారంలోకి తీసుకుని వచ్చే క్రమంలో విజయసాయి రెడ్డి కూడా బాగానే కృషి చేస్తున్నారు. తాజాగా కోడికత్తి వ్యవహారం, జగన్‌పై దాడి అంవాలను లక్ష్యంగా చేసుకుని వైకాపా టిడిపిని దుయ్యబడుతోంది. చంద్రబాబు వ్యతిరేకులను ఏకం చేయడంలో అలుపెరుగని కృషి చేస్తున్నారు. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని బాబు వైఫల్యాలను చేరవేస్తున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ రాజకీయా లలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా అటు ఢిల్లీ పెద్దలకు తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి మధ్య అనుసంధానకర్తగా ఉంటూ, ఇటు తెలుగుదేశం నాయకులకు కంటి విూద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రత్యేక ¬దా అంశంపై భారతీయ జనతాపార్టీతో విభేదించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు చుక్కలు చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలోని లోపాలను సేకరించే పనిలో బీజేపీ పెద్దలు తలమునకలయ్యారు. . బీజేపీ నాయకులు చంద్రబాబును బలహీనపర్చడానికై ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి సహకరిస్తున్నారని టిడిపి వారు ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా చేతులు కలుపుతున్న రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలను చంద్రబాబు

ఎలా ఎదుర్కొంటారో చూడాలి. వచ్చే ఎన్నికలు మాత్రం చంద్రబాబుకు అంత ఈజీ కావని అర్థం అవుతున్నాయి.