కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని వినతి

కొండమల్లేపల్లి అక్టోబర్ 14 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండల కేంద్రం పరిధిలోని కోల్ ముంతల్ పహాడ్ గ్రామపంచాయతీ పరిధి బాపూజీ నగర్ వాటర్ పంప్ హౌస్ వద్ద సర్వేనెంబర్ 202 లో గుర్తు తెలియని వ్యక్తులు ఆరు నెలల క్రితం అక్రమ నిర్మాణం చేపట్టారు కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టడం చట్ట విరుద్ధమని తెలిసి కూడా అధికారుల పర్యవేక్షణ లోపం వలన ప్రభుత్వ భూములలో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారు అధికారులు ఇకనైనా స్పందించి మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు జరుపుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీటీసీ రమావత్ రాణి రాజు నాయక్ కొండమల్లేపల్లి తహశీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు