కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్

హన్మకొండ బ్యూరో 14 అక్టోబర్ జనంసాక్షి
కాజీపేట మండలానికి చెందిన 59మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు  59లక్షల 06వేల 844రూపాయల విలువగల చెక్కులను మడికొండ పద్మశాలి భవన్ లో తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే  అరూరి రమేష్  పంపిణీ చేశారు.
 ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ… పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావొద్దనే సీఎం కేసీఆర్‌  ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణరాష్ట్రం మాత్రమే అని అన్నారు.
  ఈ కార్యక్రమంలో తహసీల్దార్, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు,  తదితరులు పాల్గొన్నారు.
Attachments area