కొండమల్లేపల్లి మండల పరిధిలోగల రాముని గుండ్ల తండా లో బాధితులను పరామర్శించిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం.

కొండమల్లేపల్లి మండల పరిధిలోగల రాముని గుండ్ల తండా లో బాధితులను పరామర్శించిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం. ఆయన మాట్లాడుతూ ఒక అమానుషమైన ఘటన రాముని గుండాల తండా లో జరగడం దురదృష్టకరమని గిరిజన తండాల్లో ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయించడం అనేది సభ్య సమాజం తలదించుకునేలా అవమానించడం అని ఏదైనా తప్పు జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప వామపక్ష ఉద్యమాలకు ఒక చైతన్యం అటువంటి జిల్లా లో గల కొండమల్లేపల్లి మండల పరిధిలో వాళ్లకు వాళ్లే చట్టాన్ని చేతులోకి తీసుకోవడం గ్రామంలో అందరి ముందు ఇలా చేయడం మంచిది కాదని దీనిని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దీనికి పాల్పడిన వ్యక్తులపై మరియు సర్పంచ్ తో సహా కేసులు నమోదు చేయాలని ఎస్పి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నూనె రామస్వామి, గిరిజన మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి గిరిరమ, మండల కార్యదర్శి గుమ్మకొండ వెంకట్ రెడ్డి, టౌన్ కార్యదర్శి సోమ్లా నాయక్, రమావత్ పర్షియా నాయక్ తదితరులు పాల్గొన్నారు