కొండమల్లేపల్లి రైతు బంధు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి సుడిగాలి పర్యటన

కొండమల్లేపల్లి అక్టోబర్ 1 (జనంసాక్షి): కొండ మల్లేపల్లి రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు కేసాని లింగారెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు& దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం దేవత్ పల్లి గ్రామంలో గడపగడపకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా గడపగడపకు వెళ్లి గత 8 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాలను క్షుణ్ణంగా వివరించారు అంతేకాకుండా రానున్న ఉప ఎన్నికలు మునుగోడు నియోజకవర్గంలో దేవరపల్లి గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీకి అధిక ప్రాధాన్య ఇచ్చి భారీ మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు కేసానని లింగారెడ్డి, కొండమల్లేపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి, దేవరకొండ మాజీ MPP మేకల శ్రీనివాస్ యాదవ్, దేవత్ పల్లి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు