కొండాపూర్ గ్రామం నుంచి భారీగా కాంగ్రెస్ లో చేరిన యువకులు
ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామం నుండి 40 మంది యువకులు ఆయా పార్టీల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారి సమక్షంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.హైదరాబాదులో లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వారందరికీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని రాబోయే రోజుల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తధ్యమని దాంతో పేదల బతుకులు మారుతాయని ఆయన అన్నారు.వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉందని యువకులు కార్యకర్తలు కష్టపడి పార్టీని విజయ తీరాలకు చేర్చాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారాయణరెడ్డి కృష్ణారెడ్డి జంగయ్య తదితరులు పాల్గొన్నారు