పాత ఏజెన్సీ నుంచి పేర్లు బదలాయింపు
వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం
చోద్యం చూస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు
హైదరాబాద్,జూలై 24(జనంసాక్షి): ఈ మధ్య కొత్తగా గ్యాస్ ఏజెన్సీలు పుట్టుకుని రావడం, కొత్తగా అనుమతులు పొంది ఏజెన్సీలు స్థాపించడంతో సమస్యలు వచ్చి పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాలతో పాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా గ్యాస్ వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నారు. గ్యాస్ బుక్కింగ్ కోసం ఏజెన్సీకి ఫోన్ చేస్తే విూ గ్యాస్ ఖాతా మావద్ద లేదని ఫోన్ పెట్టేస్తున్నరు. గట్టిగా అడిగితే ఫలానా ఏజెన్సీకి బదలాయించారని సమాధానం ఇస్తున్నారు. ఎందుకని అడితితే సమాధానం ఇవ్వండ లేదు. వినియోగదారుల సమ్మతి లేకుండానే వంట గ్యాస్ ఏజెన్సీలను ఇంధన కంపెనీలు మార్చేస్తోన్నాయి. దశాబ్దల తరబడి ఒక ఏజెన్సీ వద్ద వినియోగదారులుగా ఉన్న వారిని రాత్రికి రాత్రే మరో ఏజెన్సీలోకి బదిలీ చేస్తోన్నాయి. ఈ విషయం కేవలం ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మాత్రమే తెలియజేస్తో న్నాయి. గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ వినియోగదారుల నెంబర్లు, ఏజెన్సీలు మారి పోతోన్నాయి. ఈ విషయం తెలియక వినియోగదారులు ఏజెన్సీ వద్దకు వెళితే విూ నెంబరు వేరే డీలర్‌కి మార్చారని సమాధానం చెబుతోండటంతో విస్తుబోతోన్నారు. అంతా గజిబిజీ గందరగోళంగా మారడంతో జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడుతోన్నారు. గ్యాస్ ఏజెన్సీని సస్పెన్షన్ చేయడమో, నిర్వాహకుడు చనిపోవడమో, వేరొక ఏజెన్సీకి తక్కువ కనెక్షన్లు ఉన్నాయన్న కారణాలతో క్రమబద్ధీకరణ పేరుతో ఇలా కనెక్షన్లను వినియోగదారులకు తెలియకుండా మార్చేస్తో న్నారు. ఇలా విచ్ఛలవిడిగా వంట
గ్యాస్ కనెక్షన్లకు ఏజెన్సీలు మారుస్తోండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతోన్నారు. చాలా మందికి తమ కన్స్యూమర్ నెంబరు, ఏజెన్సీ మారిందని తెలియదు. ఫోన్‌లో బుకింగ్ చేస్తే మా వద్ద గల రికార్డుల ప్రకారం విూ నెంబరు ఫలాన అని చెబుతోండటంతో ఆ నెంబరు తమది కాదేమోనని డిస్‌కనెక్ట్ చేస్తున్నారు. నిత్యం ఏజెన్సీల వద్ద వినియోగదారులు గొడవ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు తెలియకుండా ఏజెన్సీని ఎలా మారుస్తారని ప్రశ్నిస్తోన్నారు. అందుకు ఏజెన్సీ సిబ్బంది స్పందిస్తూ ఇవి మేము చేసినవి కాదని, ఇంధన కంపెనీల నిర్ణయమని చెబు తోన్నాయి. ఈ గందరగోళానికి తెరదించాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉన్నది. ఇలాంటి గొడవలు రాకుండా కొత్త ఏజెన్సీ రాగానే దానికి దగ్గరగా ఉన్న వినియోగదారులను బదలాయించేలా చూడాలని కోరుతున్నారు. అంతేగాని ఎక్కడో దూరంగా ఉన్న వారిని కలపవద్దని కోరుతున్నారు.
…………………………………..
—
——————-
———————-
—————
——————
—————-
—————
——————




