కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక ధర్నా
ఉండవల్లి,
సెప్టెంబర్ 27( జనం సాక్షి)::
డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు 65 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత 65 రోజులుగా ఇంటిని వదిలి, కుటుంబ సభ్యులను వదిలి నిరాహార దీక్షలో కూర్చున్న ప్రభుత్వం స్పందించడం లేదని వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు, కో కన్వీనర్ షేక్షావలి, నారాయణ, కృష్ణ, నాగవేణి, జహాదా, గజేంద్ర గౌడ్, యాదగిరి జమీలాభి, బాబు తదితరులు పాల్గొన్నారు.
Attachments area