కొన్నే గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు

బచ్చన్నపేట సెప్టెంబర్ 19 (జనం సాక్షి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం. కొన్నే గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయని గౌడ సంఘం అధ్యక్షులు కోల రమేష్ అన్నారు. సోమవారం పండుగ ఉత్సవాల గురించి తెలిపారు . ఆదివారం రాత్రి పోచమ్మ బోనాలు జరిగాయని సోమవారము పుట్ట బంగారానికి పోయి గంప కప్పడం జరిగిందని అనంతరం కాటమయ్యకు మహిళలు కాటమయ్యకు బోనాలతో వెళ్లి నైవేద్యం సమర్పించారని. మంగళవారము రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించిన అనంతరం కళ్యాణ ఉంటుందని గ్రామస్తులు బంధుమిత్రులు పిల్లాపాపలతో అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. గౌడ సంఘం నాయకులు కలకుంట స్వామి. అంబాల ఆగయ్య. వేముల రామస్వామి. వేముల విద్యాసాగర్. వేముల లక్ష్మణ్ గౌడ్. బిక్షపతి. పోశయ్య. శంకరయ్య. ఆంజనేయులు తదితరులు ఉన్నారు