కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు..
జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్యెల్యే కొమ్మూరి
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. నిరంతర పోరాటాలలో భాగంగా న్యూఢిల్లీలో మెహంగాహిపర్ హల్లా బోల్ పేరుతో రామ్ లీలా మైదానంలో నిర్వహించే ర్యాలీ కోసం కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 4న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, ఈ ర్యాలీని ఉద్దేశించి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారన్నారు. సెప్టెంబర్ 4న ఉదయం 11 గంటలకు, రామ్ లీలా మైదానానికి చేరుకుని బిజెపి వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీగా తరలివెళ్లారు.