Wednesday, 4 November 2026

కోఆప్షన్ సభ్యునిగా రాజమల్లు…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 27
కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం మండలం కరీంపేట గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులుగా వనపర్తి రాజమల్లు, మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వనపర్తి మల్లయ్య మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పంచాయత్ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యుల నియామకం ఉత్తర్వులు జారీ చేయగా గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి సాలా రోద్దీన్ ను గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యుల నియామకం చేసుకోగా, ఇటీవల సాలారోద్దీన్ మృతి చెందడంతో, ఆయన స్థానంలో కోఆప్షన్ సభ్యులుగా వనపర్తి మల్లయ్య ను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏకగ్రీవంగా నియామకము చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ చింతం రాజేశం, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.