Tuesday, 3 November 2026

కోచింగ్‌ సెంటర్లకు గిరాకీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): వివిధ గ్రూప్‌ ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు నింపడం ఒక ఎత్తయితే మరోవైపు అనేక రంగాల్లో ఇప్పుడు కోచింగ్‌ సెంటర్లు దూసుకుని పోతున్నాయి. ఎత్తున ఎప్పుడూ ఉద్యోగాల భర్తీ జరగలేదని పలువురు అంటున్నారు. తాజాగా ఇప్పుడు నిరుద్యోగ సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోచింగ్‌ సెంటర్లకు మళ్లీ కళ వచ్చింది. దాదాపు అన్నిసెంటర్లు మళ్లీ ఈ ప్రకటన ఆధాంగా కోచింగ్‌కు సిద్దం అవుతున్నాయి. రానున్న కాలంలో లక్షకుపెగా ఉద్యోగాల కల్పనకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ చర్యలు తీసుకుంటారన్న ఆశాభావంతో ఉనట్లు పేర్కొంటున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకో వడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. కేవలం ప్రభుత్వరంగంలోనే కాకుండా ప్రైవేట్‌రం గంలోను నిరుద్యోగ యువతీ, యువలకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టీఎస్‌ఐపాస్‌ దోహదపడుతోందని అన్నారు. సీమాంధ్ర పాలకులు పెంచిన నిరుద్యోగ మూలాలను నిర్మూలించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన సాగుతోందని తెలంగాణ విద్యార్ధి, యువజన జేఏసీ చైర్మన్‌ డా. ఆంజనేయగౌడ్‌ అన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ నిరుద్యోగ నిర్మూలనకు కట్టుబడి ఉందని స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా 10వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సర్కార్‌, తాజా నోటిఫికే షన్‌తో నిరుద్యోగ యువతీ, యువకులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవడం అభినందనీయ మన్నారు. ప్రస్తుత గ్రూప్‌-2 ఉద్యోగ నోటిఫికేషన్‌ పరిశీలిస్తే, ప్రభుత్వరంగ సంస్థల్లోను వేలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించడం యువజన జేఏసీ స్వాగతిస్తోందని చెప్పారు.

—————