కోతకు గురైన టాకీగుడ వంతెన
గుడిహత్నూర్: జూలై 22( జనం సాక్షి)గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది మండలంలోని టాకీ కూడా గ్రామ సమీపంలోని వంతెన వద్ద వరద ఉధృతంగా ప్రవహించడంతో మట్టి కొట్టుకపోయి వంతెన కోతకు గురైంది గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో సునీత,వాగు ఉధృతిని కోతకు గురైన వంతెనను పరిశీలించారు వంతెన కు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు వారిని కోరారు వారి వెంట ఏఎస్ఐ బలిరాం, పంచాయతీ కార్యదర్శి లావణ్య ఉన్నారు