నాంపల్లి అక్టోబర్ 21 (జనం సాక్షి )కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవడం కోసం స్థానిక బిజెపి నాయకులు గడప గడప ప్రచారాన్ని నిర్వహించారు. శుక్రవారం నాంపల్లి మండలం కేంద్రంలో బిజెపి నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం గడప గడప ప్రచారం నిర్వహిచారు. మండలంలోని కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల నుంచి పది మంది కార్యకర్తలు ఎరెడ్ల రఘుపతి రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలోపెద్దిరెడ్డి రాజు, మేకల యాదయ్య, రామకృష్ణ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.




