కోయగూడెంలో అన్నదానాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

 

 

 

 

 

 

 

టేకులపల్లి ,సెప్టెంబర్ 29( జనం సాక్షి): కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రుల లో భాగంగా కోయగూడెం గ్రామంలో ఉత్సవ భక్తమండలి కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రులు భక్తిపారవశంతో పూజలు నిర్వహించాలని, ఆ తల్లి ఆశీస్సులు అందరిపైనా చల్లని చూపులు చూడాలని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కోయగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పూనం ఉమా, ఎంపీటీసీ జాలే సంధ్య, మాజీ ఎంపీటీసీలు కంకణాల విజయ, పెరుగు సత్యనారాయణ, శరన్నవరాత్రుల ఉత్సవ భక్త మండలి కమిటీ వారు ముత్తవరపు తిరుమలరావు, గంగారపు రమేష్, గంగారపు శ్రీను, గంగారపు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.