జన హృదయ యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు.
ఘనంగా పార్టీ శ్రేణుల సమక్షంలో రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.
యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు.
తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యువ నాయకులు రవీందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మిత్రులు కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. మరెన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాలాల మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.