కోయగూడెం ఉపరితల గనిలో పర్యటించిన డైరెక్టర్
టేకులపల్లి, ఆగస్టు 7 జనం సాక్షి ): సింగరేణి డైరెక్టర్(పిపి) జి.వెంకటేశ్వర రెడ్డి, జిఎం సేఫ్టీ కార్పోరేట్ కే గురవయ్య, ఇల్లందు ఏరియా లోని కోయగూడెం ఉపరితలగనిలో పర్యటించారు. ఈ సందర్బంగా వారు ఓసి పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద్ ను అడిగి తెలుసుకున్నారు. తరువాత డైరెక్టర్(పిపి) జి.వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించాలని, అలాగే వర్షం కారణంగా బొగ్గు ఉత్పతి లో ఎలాంటి ఆటంకం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని, సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలనుఅధిగమించాలని అధికారులు రక్షణ పై దృష్టి పెట్టి ఉద్యోగులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎం సేఫ్టీ కార్పోరేట్ కే గురవయ్య, ప్రాజెక్ట్ అధికారి ప్రహ్లాద్, సేఫ్టీ ఆఫీసర్ రాజు, ఇతర అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.