హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సమర్పణ గడువును ప్రభుత్వం పెంచింది. రిజిస్ట్రేషన్ ధర చెల్లించే కేటగిరీ దరఖాస్తులకు గడువును ఫిబ్రవరి 28 దాకా పెంచింది. కానీ ఉచిత కేటగిరీ దరఖాస్తుల సమర్పణకు మాత్రం జనవరి నెలాఖరు దాకానే గడువిచ్చింది. క్రమబద్ధీకరణపై సోమవారం సచివాయలంలో పలువురు మంత్రులతో జరిపిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయించారు.
‘‘పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు తొలి ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాలను ఎవ రూ ఆక్రమించుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి’’ అని మంత్రులకు, అధికారులకు సూచించారు. భేటీలో కేంద్రమంత్రి దత్తాత్రేయతో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, ఉన్న తాధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. 125 గజాల్లోపు ప్రభుత్వ స్థలాలకు ఉచితంగా, అంతకు మించినవాటి క్రమబద్ధీకరణకు జనవరి 31 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే




