Wednesday, 4 November 2026

క్రాప్ లోన్ రెన్యూవల్ కోసం ఆసరా పెన్షన్ నిలిపివేత

ఆరు నెలలుగా అందని ఆసరా పెన్షన్ అకౌంటు ఓల్డ్ లో పెట్టి నిలిపివేసిన బ్యాంక్ అధికారులు

జోగుపేట ఏపీజీవీబీ బ్యాంకు అధికారుల పై చర్యలు తీసుకోవాలి

సిపిఎం అందోల్ మండల కన్వీనర్ ది విద్యాసాగర్

జనం సాక్షి జోగుపేట్ ఆందోల్ జోగుపేట పట్టణంలోని బుధవారం మంజీరా గ్రామీణ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వలన గత ఆరు ఏడు నెలలుగా ఆసరా పెన్షన్ డబ్బులు అందక పింఛన్దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని సిపిఎం అందరూ మండల కన్వీనర్ ది విద్యాసాగర్ అన్నారు ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్నవారు గత ఆరు నెలలుగా బ్యాంకు చుట్టూ తిరిగిన క్రాఫ్ లోన్ రెన్యువల్ చేస్తేనే అకౌంట్ హోల్ నుండి తీస్తామని రెన్యువల్ చేసుకునే వరకు పెన్షన్ డబ్బులు ఇవ్వమని బ్యాంక్ అధికారులు తెగేసి చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్నవారికి అవసరాల నిమిత్తం ప్రతి నెల ఇచ్చే పెన్షన్ డబ్బులు క్రాప్ లోన్ పేరిట చెల్లించకపోవడం చాలా దుర్మార్గమని తక్షణమే బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకొని ప్రతి నెల పింఛన్ అందేలా చూడాలని అన్నారు క్రాప్లోన్లకు పింఛన్ డబ్బులకు సంబంధం లేదని ప్రభుత్వాధికారులు చెప్పినా బ్యాంకు అధికారం నిర్లక్ష్యం వలన ఆసరా పింఛన్ అందడం లేదు బ్యాంకు అధికారులను అడుగుతే మాకు సంబంధం లేదు క్రాప్ లోన్ కడితే పింఛన్ ఇస్తామని చెప్తున్నారు వచ్చే రవి పంటలపై కడతామని చెప్పిన వినకుండా పింఛన్దారుల అకౌంట్లు ఓల్డ్ లో పెట్టారు అనేక మంది పింఛన్దారులు 6 నెలలుగా బ్యాంకుల చుట్టూ తిరిగిన పింఛన్ ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని అకౌంటు పనిచేసే విధంగా చేసి ఆసరా పింఛన్ ఇప్పించాలని లేనిచో ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భూషణం సురేష్ తదితరులు పాల్గొన్నారు