రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని పశు ఆరోగ్య ఉపకేంద్రం పశు సంపద సహాయకులు దాసరి శంకర్

ఆధ్వర్యంలో గొర్రెల మేకలకు పశు వైద్య శిబిరం భూపతిపూర్ యాదవ సంఘం భవనంలోని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ గ్రామ సర్పంచి జక్కుల చంద్రశేఖర్ పాల్గొని గొర్రెల మేకల పెంపకదారులకు మందులు పంపిణీ చేయడం జరిగింది అనంతరం సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ యాదవ సోదరులు పశుసంవర్ధక శాఖ నుండి వచ్చే మందులను గొర్లకు మేకలకు రోగాలు రాకుండా మందులు వేయించుకోవాలని అలాగే కాలచక్రం ప్రకారం అన్ని రకాల టీకాలను గొర్లకు మేకలకు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు టీకాలను వేయించుకోవాలని వ్యాధుల బారిన పడిన గొర్రెలను మేకలను చికిత్స కోసం పశు ఆరోగ్య ఉప కేంద్రం భూపతిపూర్ కు తీసుకువచ్చి వైద్యం చేయించుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో మైతాపూర్ పశుసంపద సహాయకులు మేకల రాజ గంగారాం, రాయికల్ ప్రాథమిక పశు వైద్య కేంద్రం, పశు వైద్య సహాయకులు కె.వి వెంకటరమణ, గొర్రెల మేకల పెంపక దారులు నాగెల్లి మధు అలే మహేష్ , బొడ్డు పెద్ద మల్లేశం, పిల్లి మల్లేశం, వెంకటస్వామి, మల్లయ్య వెంకన్న, రాములు తదితరులు పాల్గొన్నారు