క్రిస్టియన్ మైనార్టీల ఉద్యమకారునికి సముచిత స్థానం.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 20, జనం సాక్షి.
రాయపోల్ మండల పరిధిలో తిమ్మక్కపల్లి చర్చిలో క్రైస్తవ సార్వత్రిక ఫెలోషిప్ దుబ్బాక నియోజకవర్గం పాస్టర్సు ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మిని ఘనంగా సన్మానించారు. దుబ్బాక నియోజకవర్గం పాస్టర్ ఫెలోషిప్ క్రైస్తవ బిడ్డ ఉద్యమకారుడు ఇప్ప దయాకర్ కుటుంబానికి దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం గర్వకారణం అన్నారు.కేసిఆర్ ప్రభుత్వానికి క్రైస్తవులం ఎప్పటికీ రుణపడి ఉంటాం అన్నారు.మంత్రి హరీష్ రావుకు,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి మండలాల పార్టీ అధ్యక్షులకు, ఉమ్మడి మండలాల ఎంపిటిసిలకు, సర్పంచులకు,పార్టీ సీనియర్ నాయకులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో దుబ్బాక నియోజకవర్గం సార్వత్రిక ఫెలోషిప్ పాస్టర్లు పాల్గొన్నారు.
Attachments area