క్రీడాలతో మానసిక ఉల్లాసం

ఝరాసంగం అక్టోబర్ క్రీడాలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది అని జహీరాబాద్ సి ఐ తోట భూపతి వైపిఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ వై ప్రభాకర్ లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఝరా సంగం మండలం లోని పొట్టి పల్లి గ్రామంలో ప్రీమియం లీగ్ లో విజయం సాధించిన విన్నర్స్ కు మరియు రన్నర్స్ కు బహుమతులను
అంబేద్కర్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి పల్లి ప్రీమియం లీగ్ సీజన్- కు హాజరై బహుమతులు ప్రధానం చేశారు. ఈనెల 6 వా తారీకు నుండి 9వ తారీఖు వరకు 4 రోజులు పొట్టి పల్లి ప్రీమియం లీగ్ సీజన్- 2 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా పొట్టి పల్లి గ్రామంలోని 6 క్రికెట్ టీంలు 1, అంబేద్కర్ క్రికెట్ క్లబ్ 2, భీమ్ సేన క్రికెట్ క్లబ్ 3, జై భవాని క్రికెట్ క్లబ్ 4, యంగ్ స్టార్ క్రికెట్ క్లబ్ 5, గోల్డెన్ బుల్స్ క్రికెట్ క్లబ్ 6 క్రిస్టియన్ క్రికెట్ క్లబ్ టీంలు పాల్గొనగా నాలుగు రోజులు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలో అంబేద్కర్ క్రికెట్ క్లబ్ మరియు జై భవాని క్రికెట్ క్లబ్ టీం లు ఫైనల్ కు రావడంతో 9 వ తారీఖున జరిగిన ఫైనల్ పోటీలో జై భవాని క్రికెట్ క్లబ్ విజయం సాధించగా అంబేద్కర్ క్రికెట్ క్లబ్ రన్నర్ ప్రైస్ ను కైవసం చేస్తుందని ఆర్గనైజింగ్ టీం అంబేద్కర్ క్రికెట్ క్లబ్ కెప్టెన్ రీజింతల్ రవి, రాజోలి మల్లేష్, ముద్ద ప్రశాంత్, రాజోలి శ్రీనివాస్ మరియు ఆర్గనైజింగ్ సభ్యులు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మొగులయ్య,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముల్గి మల్లికార్జున్, ఎల్గోయి శివరాజ్, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు