క్లాస్ మెట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగ్స్,డిక్షనరీలు పంపిణీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి):
కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా,తాడూరు మండల కేంద్రంలోని ఆకునెల్లికుడురు గ్రామ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం బ్యాగ్స్ డిక్షనరీలు పంపిణీ చేశారు.క్లాస్ మెట్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాస రాఘవేంద్రరావు ఆదేశాలనుసారం ప్రేమ్ చంద్ రెడ్డి,దీపిక ఆర్థిక సహాయంతో మంగళవారం క్లాస్మేట్ క్లబ్ నాగర్ కర్నూల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి రమణ కుమార్,క్లాస్మేట్ క్లబ్ ప్రతినిధి కంచర్ల శ్యాంసుందర్ విద్యార్థులకు బ్యాగ్స్, డిక్షనరీలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి ప్రయోజకులు కావాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.జ్యోతి మాట్లాడుతూ క్లాస్ మేట్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు.అనంతరం క్లాస్ మేట్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాస రాఘవేంద్రరావు కి,దాతలు ప్రేమ్ చంద్ రెడ్డి,దీపిక లకు,పంపిణీ చేసిన క్లాస్ మేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ కు, క్లాస్ మేట్ క్లబ్ ప్రతినిధి కంచర్ల శ్యాంసుందర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.