గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య
45 ఏండ్ల తరువాత ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండిన సందర్భంగా పెద్ద చెరువు లో గంగా హారతి లో పాల్గొన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యాక్చులు రాజ్యసభ ఎంపి ఆర్ కృష్ణయ్య.ఈ సంధర్బంగా ఆర్ కృష్ణయ్య మాట్లడుతూ 45 ఏండ్ల తరువాత ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేయటం కోసం భూములు లేకుండా పోయాయని అన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగటం వల్ల భూములు ఆన్ని కబ్జాలకు గురయ్యానని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం దళితులకు దలిత బంధు ఇచ్చినట్లు బీసీలకు బిసి బందు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం బీసీలకు ఆన్ని రంగాలలో అభివృద్ధి చేసిందని తెలిపారు.
ఎమ్మెల్యే లను, మంత్రులను , బిసి కార్పరేషన్ లుఎర్పాటు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని తెలిపారు.ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజ్వేషన్ల ఉన్నాయి కాని చట్ట సభల్లో రిజ్వేషన్ సాధించాలని అందుకోసం బిసి సంఘాల కలసి కట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.రాబోయే కాలంలో ఇబ్రహీం పట్నం లో ఆన్ని రాజకీయ పార్టీలు బిసి లకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే ను చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ప్రoట్ చైర్మన్ గోరిగే మల్లేష్ యాదవ్ అధిబట్ల మున్సిపల్ వైస్ చెర్ పర్సన్ కోరే కలమ్మ జంగయ్య,కౌన్సిలర్లు జగదీష్ యాదవ్,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు