గడప గడపకు పిల్లుట్ల రఘు సేవలు

గరిడేపల్లి, జులై   (జనం సాక్షి):ఓజో పౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు అన్న ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న ఆదేశాల మేరకు హుజూర్ నగర్  నియోజకవర్గ వ్యాప్తంగా  గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో బుధవారం గరిడేపల్లి  మండలం గడ్డిపల్లి   గ్రామంలో తురక పిచ్చమ్మ అమరపు వెంకటేశ్వర్లు 50  కేజీల బియ్యం    బాధితులకు రఘు చేయుత కార్యక్రమంలో భాగంగా బాధిత కుటుంబానికి   ఆర్థిక సాయంగా అందించారు. దోసపాటి వెంకటేశ్వర్లు పరామర్శించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో  ఓజో ఫౌండేషన్  మండల సభ్యులు మన్నెం  వేణు మాట్లాడుతూ రానున్న రోజులలో ప్రతి గడపకు ఓజో ఫౌండేషన్ సేవలు అందే విధంగా కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కులాల కుటుంబాల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇదే తరహాలో  రఘు  చేయూత కార్యక్రమం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో పేదింటి కుటుంబాలకి అండగా వివిధ సేవలందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ మండల సభ్యులు మన్నెం వేణు యాదవ్, గుంజ సందీప్ షేక్ బాషా సాయి నరేష్  తరుణ గోపీచందు  గ్రామస్థులు ఓజో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.