కూకట్ పల్లి (జనంసాక్షి):వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో బాలా నగర్, ఫతే నగర్ డివిజన్ లోని టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం పలు వినాయక మండపాలలోని గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెరబండ రాజు నగర్ కాలనీలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయని, వినాయక మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటున్నదని, పూజలు, అన్నదాన కార్యక్రమాలతో మండపాలు కళకళలాడుతున్నాయని అన్నారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మట్టే ప్రసన్న కుమార్, మధు గౌడ్, ముఖేందర్, మహేందర్, రాజ శేఖర్, రాజ మల్లయ్య, సత్యనారాయణ, యాదగిరి, పుట్టపాక రాము తదితరులు పాల్గొన్నారు.
గణనాథుడి పూజలో పాల్గొన్న సత్యం శ్రీరంగం….




