గణపతి నవరాత్రి అన్నదానం

డోర్నకల్  సెప్టెంబర్ 10 జనం సాక్షి
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో వార్డు కౌన్సిలర్ తేజావత్ సంధ్యారాణి రమేష్ న్యాయవాది నేతృత్వంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఐ జూపల్లి వెంకటరత్నం,తాసిల్దార్ గుండు వివేక్,తెరాస మండలాధ్యక్షుడు నున్నా రమణ చేసి మహా అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు మతాలకు కులాలకు అతీతంగా నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ పట్టణ ప్రజలు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండేటట్టు వినాయకుడు దీవించాలని వేడుకున్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్ పోటు జనార్ధన్,బోరగాల శ్రీనివాస్, రామకృష్ణ,సాయి,చరణ్,రమేష్,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు