ఎమ్మెల్యే కొప్పుల వెంటే మేముంటాం..మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం
– అంతారం సర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు
కుల్కచర్ల, సెప్టెంబర్ 11(జనం సాక్షి):
కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ కృష్ణ, నలుగురు వార్డు సభ్యులతో సహా మొత్తం 50 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు.ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వెంటే మేముంటామని,తమ పూర్తి మద్దతు తెరాస ప్రభత్వానికేనని వారు ముక్తకంఠంతో తెలియచేసారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసే తామంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్, వార్డు సభ్యులు తెలిపారు.శనివారం పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలు వివరించారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే గ్రామంలో పర్యటిస్తానని,గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ బృంగి హరికృష్ణ, రైతుబంధు మండల అధ్యక్షులు కేబీ రాజు, మాజీ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీ నర్సింలు,తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.