Wednesday, 4 November 2026

*గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి పొందాలి*

*గోపాల్ పేట్ ఎస్సై నవీద్*
*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(29):*
గోపాల్ పేట్ మండల పరిధిలోని అన్ని గ్రామాల లో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసుకునే మండపాల కొరకు ఆయ కమిటీలు తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఎస్సై నవీద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునే వారు ముందుగా కమిటీగా ఏర్పడి సభ్యుల పేర్లను పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రిపూటలో మైకులు డీజేలు పెట్టరాదు అని తెలిపారు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలి అనుకునే భక్తులు, వివిధ సంఘాల యువకులు, మండపాల నిర్వాహకులు, పోలీస్ పోర్టల్ టీఎస్ పోలీస్. గవర్నమెంట్. లింకు ద్వారా మీ మొబైల్ ఫోన్ , మీసేవ ద్వారా, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలని వారన్నారు