Wednesday, 4 November 2026

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి

ఘట్కేసర్ ఆగస్టు 28 జనం సాక్షి ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి లోనే కాకుండా మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో గణేష్ చవితి సందర్భంగా గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఘట్కేసర్ సీఐ చంద్రబాబు అన్నారు. శివ రెడ్డి గూడా బంధన్ ఫంక్షన్ హాల్లో సిఐ చంద్రబాబు ఆధ్వర్యంలో గణేష్ ఫెస్టివల్ 2022 సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి రాచకొండ పోలీస్ కమిషనరేట్ మల్కాజ్గిరి ఏసీపీ నరేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వినాయక చవితి పండగ సందర్బంగా మండపాల నిర్వాహకులు తీసుకోవలసిన జాగ్రతల గురించి వారు మాట్లాడుతూ రోడ్డుకు అడ్డంగా మండపాలు పెట్టరాదని,మండపాల్లో రాత్రి సమయంలో మైకులు బంద్ చేయాలని గణేష్ మండపాల నిర్వాహకులు రాత్రి వేళలో తప్పనిసరిగా మండపంలో ఉండాలని సూచించారు. డీజే లకు అనుమతి లేదని, మండపంలో ఎన్ని అడుగుల వినాయకుని పెడుతున్నారు ఎన్ని రోజులు పూజలు చేసి ఎక్కడ నిమజ్జనం చేస్తారు అని పూర్తి వివరాలు పోలీస్ స్టేషన్లో తెలిపి అనుమతి తీసుకోవాలని అన్నారు.అదేవిధంగా మండపాల వద్ద ఎలాంటి అసభ్యకరమైన పాటలు ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను మాత్రమే పెట్టుకోవాలన్నారు.మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని వారు అన్నారు. గణేష్ మండప నిర్వాకులు మద్యపానం సేవించకుండా నిష్టగా భక్తిశ్రద్ధలతో ఉండాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ సీఐ జంగయ్య మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి, తాసిల్దార్ భాస్కర్ రెడ్డి,వివిధ గ్రామాల వినాయక మండప నిర్వాహకులు పాల్గొన్నారు.