గద్దర్ చిత్రపటానికి ఘననివాళులర్పించిన కాంగ్రెస్ శ్రణులు. – కార్యక్రమంలో పాల్గొన్న బట్టా విజయ్ గాంధీ.

బూర్గంపహాడ్ ఆగస్టు 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు డీసీసీ ఆదేశానుసారం తెలంగాణ ఉద్యమానికి పాటలద్వారా ప్రాణంపోసిన గుమ్మడి విట్టల్ రావు అలియాస్ గద్దర్ చిత్రపటానికి సోమవారం నియోజకవర్గ నాయకులు బట్ట విజయ గాంధీ, కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయకుడు కాలికి గజ్జె కట్టి తన ఆటాపాటలతో ప్రపంచానికి తెలంగాణ ఉద్యమస్వరూపాన్ని చాటిచెప్పిన ఉద్యమకారుడు, ప్రజానాయకుడు గద్దర్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ మండల కేంద్రం లో ఏర్పాటుచేసిన గద్దర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మందా నాగరాజు, మాజీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు పూలపెళ్లి సుధాకర్ రెడ్డి, బొర్రా భద్రయ్య, నగులూరి వీరారెడ్డి, సోంపల్లి సర్పంచ్ తాటి వీరాంజనేయులు, ఉప్పసాక సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు, బి సి సెల్ నాయకులు దాసరి సాంబ, మైనారిటీ నాయకులు షేక్ నయీమ్, ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షురాలు బర్ల నాగమణి, మండల కమిటీ నాయకురాళ్లు భూక్యా సుగుణ, స్వర్ణ, యువజన కాంగ్రెస్ శ్రేణులు-పార్టీ సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు