గద్దర్ మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు-జిల్లా సిపిఐ కౌన్సిల్ సభ్యుడు రామ్ చందర్
టేకులపల్లి, ఆగస్టు 7( జనం సాక్షి ): పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల పైన, ప్రజా సమస్యల పైన జరిగే ఉద్యమాలకు గద్దర్ స్వరం ఆయుధంగా మారిందని, అలాంటి గొంతుక మూగబోవడం ఉద్యమాలకు తీరనిలోటని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు గుగులోతు రామ్ చందర్ అన్నారు. ప్రజా కళాకారుడు,ప్రజా యుద్ధ నౌకాగా ఖ్యాతి గడించిన గద్దర్ నేటి తరం కళాకారులకు ఆదర్శమన్నారు. గద్దర్ మృతి పట్ల టేకులపల్లి మండల కౌన్సిల్ సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.