Friday, 6 November 2026

గల్ఫ్ సేవా సమితి ఆర్థిక సహాయం

జనం సాక్షి కథలాపూర్
నిరుపేద కుటుంబం, పెద్ద దిక్కును కోల్పోయింది దిక్కులేని స్థితిలో ఉన్న వారి కుటుంబానికి బొమ్మెన గల్ఫ్ సేవాసమితి నిత్యవసర వస్తువులతో పాటు 15000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పిడుగు లావణ్య తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ సేవా సమితి చేస్తున్న ఆర్థిక సహాయం హర్షించదగ్గ విషయమని అన్నారు, వారు రానున్న కాలంలో ఎన్నో సేవలు చేసి గ్రామాన్ని ముందు ఉంచాలని ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కోడి మ్యాల కిరణ్, చెక్కపల్లి మధు,, వంశీ రాజేందర్ రాజ్ కుమార్ వెంకటస్వామి బాల గంగరాజు పాల్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు