బీఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్ సర్వీస్ కేజీఎమ్ కాంప్లెక్స్ లో ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు రమేష్ తెలిపారు.

ముప్కాల్ (జనం సాక్షి) అక్టోబర్ 15 మండల కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్ సర్వీస్ కేజీఎమ్ కాంప్లెక్స్ లో ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు రమేష్ తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీఎస్ఎన్ఎల్ తెలంగాణ రాష్ట్ర స్పోక్ అధికారి అభిలాష్ పాల్గోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సేవలను ప్రారంభించారు. మండల ప్రజలు బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని నెట్ వర్క్ సేవల కన్న బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ సేవలు ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ సిబ్బంది రమేష్, మక్తల్, సలీం, కేజీఎమ్ కాంప్లెక్స్ యజమాని కట్ట మహేష్ యాదవ్, దర్శన్ తదితరులు పాల్గొన్నారు..