గవర్నర్‌పై విమర్శలు తగవు : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌పై తెదేపా నేత రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం తగదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. తెదేపా చెప్పినట్లు నడుచుకుంటేనే గవర్నర్‌ సరిగ్గా వ్యవహరించినట్లా అని ప్రశ్నించారు. పార్టీలో ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటూ పార్టీ అధిష్టానం వారితో మాట్లాడుతుందని చెప్పారు.