గాంధారి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సై సాయిరెడ్డి

గాంధారి జనంసాక్షి జులై 11
గాంధారి మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గాంధారి ఎస్సై సాయిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలను గోడలను తాకరాదని ఆయన తెలిపారు వాటికి కరెంట్ షాక్ వస్తె ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని  ఇంటి పై కప్పు వేసిన ఇనుప రేకులను తాకరాదు శిథిలావస్థలో ఉన్న ఇండ్లు మట్టి గోడల వద్ద ఉండవద్దని రైతులు వ్యవసాయ బోర్ వద్ద బావుల వద్ద తీగలను తాకవద్దానన్నారు వరద నీటికి చెరువులు కుంటలు చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చిన్నపిల్లలు మరియు ఈతరానివారు ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువు లోకి ఈతకు గాని లేదా చేపల వేటకు గాని  వెళ్ళరాదు తల్లిదండ్రులు పిల్లలను బయటకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి వర్షానికి రోడ్లు కొట్టుకపోయి గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతల్లో వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కావున జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి వరదల వలన డ్రైనేజ్ కాలువల మ్యాన్ హోల్ తెరిచి ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు పొలాల వద్ద బోరు మోటర్ వద్ద తగు జాగ్రత్తలు పాటించాలి చెట్టు కింద పాడైన భవనాల కింద నిలబడరాదని గాంధారి ఎస్సై సాయిరెడ్డి తెలిపారు అత్యవసర సమయంలో పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 100 మరియు పోలీస్ స్టేషన్ నెంబర్ కు ఫోన్ చేయగలరు