హైదరాబాద్ : గాంధీ భవన్ లో మేడే వేడుకలు జరిగాయి. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, విదేశీ పెట్టుబడి విధానం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్మికుల కష్టనష్టాల్లో కాంగ్రెస్ పాలుపంచుకుంటుందన్నారు.




