Wednesday, 4 November 2026

గాజులపల్లి లో వ్యక్తి అదృశ్యం ……

దౌల్తాబాద్, ఆగస్టు 12, జనం సాక్షి.
మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెలితే పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన గాడిపల్లి చిన్న కనకరెడ్డి గురువారం ఉదయం నుంచి కనిపించకపోవడంతో బంధువుల వద్ద వెతకగా ఆచూకి లభ్యం కాకపోవడంతో శుక్రవారం ఉదయం భార్య స్వప్న ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు