గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా కోట్యా నాయక్ అన్నారు.శుక్రవారం స్థానిక గాంధీ పార్కులో జరిగిన ఆ సంఘ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 10 శాతం రిజర్వేషన్ జీఓ విడుదల చేయాలన్నారు.బంజారా భవన్ ప్రారంభించక ముందే జీఓను విడుదల చేయాలని కోరారు.ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు , ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలన్నారు. రమావత్ సక్రు నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బిక్షం నాయక్ , రాజు నాయక్ , బాబు , శ్రీహరి , శ్రీను , రమేష్ తదితరులు పాల్గొన్నారు.