గిరిజనుల అభివృద్ధికి కృషి

– ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్ అన్నారు.ఆదివారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ట్రై కార్ రాష్ట్ర చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ స్థానిక బంజారా భవన్ కు వచ్చిన సందర్భంగా ఆయనను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ బలోపేతానికి , జాతి అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.ఏజన్సీ ప్రాంత , మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి అన్నివేళలా కృషి చేస్తానని అన్నారు.రాష్ట్ర గిరిజన సహకార సంస్ధ చైర్మన్ గా తనను నియమించిన సిఎం కెసిఆర్ కు, తన నియామకానికి సహకరించిన మంత్రి జగదీష్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు ధారావత్ బాబు నాయక్ ,  ప్రధాన కార్యదర్శి వెంకన్న నాయక్ ,రాష్ట్ర నాయకులు పాండు నాయక్ ,బాలాజీ నాయక్, ఫుల్ సింగ్ నాయక్ ,  మోతిలాల్ నాయక్ ,  విద్యాసాగర్ ,  డాక్టర్ రమేష్ ,  డాక్టర్ కిరణ్ ,  బిక్షం నాయక్ ,  బగ్గులాల్ మోతిలాల్,  ఉప్పయ్య నాయక్ , లింగ నాయక్ , నారి నాయక్ ,  వెంకన్న నాయక్, మంగ్య నాయక్ ,రెడ్డి నాయక్ , చీనా శ్రీను,  సైదా నాయక్,  రవి, అజయ్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.