గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు తరలి రావాలి…

ఎంపీపీ ఓలం చంద్రమోహన్
కేసముద్రం సెప్టెంబర్ 14 జనం సాక్షి / బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ ఓలం చంద్రమోహన్ పాల్గొని మాట్లాడుతూ….ఈనెల 17న హైదరాబాదులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా  సంత్ సేవాలాల్ బంజారా భవన్ ప్రారంభించనున్న నేపథ్యంలో కేసముద్రం మండలంలోని గిరిజన ప్రజా ప్రతినిధులు, అధికారులు,ఉద్యోగులు అధిక సంఖ్యలో హైదరాబాద్ తరలిరావాలని ఎంపీపీ చంద్రమోహన్ కోరారు. ఈనెల 17న  మండలంలోని పలు గ్రామాల నుంచి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ ఫరీదొద్దీన్, ఎంపీడీవో రోజా రాణి, ఎంపీవో రఘుపతి రెడ్డి, ఎపిఎం రాజీరు వివిధ గ్రామాల గిరిజన ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area