ఘనంగా పోషక వార్షికోత్సవాలు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 14, జనం సాక్షి.
 సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసం ఉత్సవాల సందర్బంగా జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ,పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలని సెప్టెంబర్ మాసంలో పోషణ మాసం ఉత్సవాలు జరపడం గర్భిణీ స్త్రీలకు గుడ్లు ,పాలు, బాలామృతం, ఆకుకూరలతో ఆహారం తీసుకుంటే తల్లి, బిడ్డలు క్షేమంగా ఉంటారని అన్నారు, ఎప్పటికప్పుడు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
 ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివ,ఎంపిటిసి లక్ష్మీనరసవ్వ, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.