గిరిజన బంధు,రిజర్వేషన్ పెంపు హర్షనీయం

 నాయకులు రాజు నాయక్
డోర్నకల్ సెప్టెంబర్ 21 జనం సాక్షి

గిరిజనులకు పది శాతం రిజర్వేషన్‌తో పాటు గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని గిరిజన నాయకులు తేజావత్ రాజు నాయక్ కొనియాడారు.సచివాలయానికి అంబేడ్కర్‌ పేరును పెట్టడం గొప్పవిషయమన్నారు.ఈ సందర్భంగా బొడ్రాయి తండాలో సర్పంచ్ తేజవత్ గమ్మిరాజు నాయక్ ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే రెడ్యానాయక్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.రాజు నాయక్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యూన్నతికి కృషి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ తేజావత్ భాస్కర్,తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోతు వెంకన్న,వార్డ్ మెంబర్లు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు జవహర్ లాల్,గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గోన్నారు.