గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

లంబాడీల ఐక్యవేదిక లైవ్ వరంగల్ జిల్లా కన్వీనర్ భూక్యా మోహన్ నాయక్

జనం సాక్షి, చెన్నరావు పేట

గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని
లంబాడీల ఐక్యవేదిక లైవ్ వరంగల్ జిల్లా కన్వీనర్ భూక్యా మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 శాతం రిజర్వేషన్ జీవోను వెంటనే విడుదల చేయాలని,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 17న బంజారా భవన్ ఆదివాసి భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా వారం రోజుల్లో గిరిజన 10 శాతం రిజర్వేషన్ జీవో విడుదల చేస్తానని హామీ ఇచ్చి వారం రోజులైనా గిరిజన రిజర్వేషన్ జీవో ఇప్పటివరకు జీవో జారీ చేయలేదని ఇచ్చిన మాటను కట్టుబడి ఉండాలని వెంటనే జీవో విడుదల చేయాలని లంబాడీల ఐక్యవేదిక వరంగల్ జిల్లా కన్వీనర్ భూక్యామోహన్ నాయక్ రాష్ట్ర సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూక్యా మోహన్ నాయక్ మాట్లాడుతూ మాపై చిత్తశుద్ధి ఉంటే మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మీడియా సమావేశంలో అన్నారు. జీవో విడుదల చేయని పక్షంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని లేని యెడల వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.