Friday, 20 November 2026

*గీత కార్మికునికి ఆర్థిక సహాయం అందజేత*

మునగాల, సెప్టెంబర్ 03(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలో ఇటీవల తాటి చెట్టుపై నుంచి పడి అస్వస్థకు గురైన పనస సత్యంగౌడ్ కు టి.ఎస్.టి.టి.సి.ఎఫ్.సి నుండి 15వేల రూపాయల చెక్కును డి.ఎస్.పి అమరగాని కృష్ణయ్య సహకారంతో శనివారం అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కలకోవ గ్రామ సర్పంచ్ శ్రీమతి కొంపల్లి సుజాతవీరబాబు, ఎంపీటీసీ గన్నా భవానీనరసింహారావు, అనంతు శ్రీను, దొంతగాని రవిబాబు, అమరగాని వీరభద్రం, పనస పెద్ద శ్రీను, దొంతగాని సుధాకర్, బచ్చు శ్రీను, మునగలేటి వీరబాబు, తొండల లింగయ్య, బెల్లంకొండ నాగయ్య, పనస తిరపయ్య, చిర్రా వెంకటయ్య, బొలిశెట్టి నరసింహారావు, పనస శ్రీను, తుమ్మల వెంకటేశం, సురభి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.