గుండెపోటుతో మహిళ మృతి
టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): గుండెపోటు నొప్పితో మహిళ మృతి చెందిన సంఘటన సులానగర్ లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం లోని సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి లక్ష్మీనరసమ్మ(65) సోమవారం రాత్రి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో తన భర్త లక్ష్మీనారాయణ స్థానిక వైద్యుల ద్వారా చికిత్స పొందినప్పటికీ అర్ధరాత్రి నొప్పి విపరీతంగా రావడంతో పట్టణానికి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమెకు భర్తతోపాటు ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు.