Wednesday, 4 November 2026

గుండెపోటుతో మృతి చెందిన బిల్ కలెక్టర్ – నివాళులు అర్పించిన ఏఎంసి కైలాస్

ఖైరతాబాద్: ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 18 లో అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీస్ ఫారక్ బాషా గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. ఇతడు వివిధ సర్కిళ్లలో బిల్ కలెక్టర్గా, టాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. దాదాపు మూడు సంవత్సరాలు రిటైర్ గా ఉండగా హఠాన్మరణం చదరంతో కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఇతనికి ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో అతని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సిబ్బంది, తోటి అధికారులు పాల్గొన్నారు.