గురు నానక్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమ నిర్మాణాలను ఆపాలని మున్సిపల్ చెర్ పర్సన్ కు వినతిపత్రం అందజేత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఖానాపూర్ గ్రామ పరిధిలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ సంస్థల గురించి అక్కడ నిర్మించబడుతున్న కట్టడాలు గురించి మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు కి మరియు కమిషనర్ మహమ్మద్ యూసఫ్ కి పురపాలక సభ్యులు కలిసి గురునానక్ కాలేజ్ ఆవరణలో నిర్మితమవుతున్న వాటికి ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయాలని, ప్రతి బిల్డింగ్ పై పరిమిషన్ తీసుకుని ఎడల  చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ కి లక్షల రూపాయల  ఆదాయానికి గండి కొడుతూ, అడ్డగోలుగా  కడుతున్నారు. పాత కట్టడాలపై మరొక్కసారి అసైన్మెంట్ చేయవలసిందిగా, మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టకుండా చేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. స్పందించిన చైర్మన్  చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈర్లపల్లి సునీత వెంకట్ రెడ్డి,ఆకుల మమత ఆనంద్,సుల్తానా బేగం,మోహన్ నాయక్,పంది శంకరయ్య, నరాల విశాల విద్యాసాగర్ పాల్గొని వినతి పత్రం అందజేశారు