గుగులోత్ పొట్టి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన
శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్య కాశిరాం నాయక్
డోర్నకల్ ఆగస్టు-31 (జనం సాక్షి న్యూస్)
డోర్నకల్ మండలం హున్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని రాము తండాలో ఇటీవలే అనారోగ్యంతో స్వర్గస్తులైన గూగులోత్ పోట్టి కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్య కాశిరాం నాయక్.హున్య తండా గ్రామంలో బాధలో ఉన్న వారికి ఓదార్చి, మనోధైర్యాన్ని ఇచ్చి తన వంతుగా ఆర్థిక సాయం అందించడం మంచి విషయం అని కొందరికి మాత్రమే సాయం చేసే గుణం ఉంటుందని అది భూక్య కాశిరాం కి ఉండడం చాలా సంతోషంగా ఉదని, సోషల్ మీడియాలో ప్రశంసాలు కురిపిస్తున్న యువకులు ఆయన అభిమానులు. ఈ కార్యక్రమంలో గూగులోత్ అర్జున్,బాణోత్ భీముడు,బాణోత్ కుమార్,లింగ,రమేష్, గోపి,సుమన్, రాంబాబు,అశోక్, మోతిలాల్,సుధాకర్,లాల్ గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.