Thursday, 5 November 2026

గుజరాత్ గులాంల ఆటలు తెలంగాణలో సాగవు

. రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి
… జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 16, ( జనం సాక్షి ) :   గుజరాత్ గులాంల ఆటలు తెలంగాణలో సాగవ ని,చెప్పులు మోసే సంస్కృతి తమకు లేదని రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రో త్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జాతీయ జెండా ఆవి ష్కరించారు.జాతీయ జెండాలతోఎమ్మెల్యేక్యాంప్ కార్యాలయం నుండి హోలీ క్రాస్ స్కూల్ గ్రౌండ్ లో ని బహిరంగ సభ వరకు ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వ ర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా  వజ్రోత్సవాలలో భాగంగా ఏ ర్పాటుచేసిన బహిరంగ సభకు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతవహించగా ముఖ్య అతిథిగా హాజరైన రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దున్నే వాడికె భూమి కావాలని, బానిసత్వం పోవాలని, ఎందరో సమరయోధులు పోరాటం చేసి నాలుగు వేల మంది చనిపోయారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ కోసం 400 మందికి పైగా అమరులయ్యారని అన్నారు.2001నుండి2014వరకు కెసిఆర్ నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి కొట్లాడి సాధించుకున్న తె లంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటినిఅమలుచేస్తున్న ఘన త కేసీఆర్ కె దక్కిందన్నారు.తెలంగాణలో అమల వుతున్న సంక్షేమ పథకాలలో కేంద్రప్రభుత్వవాటా ఉందంటున్న బిజెపినాయకులు ఒకవేళ మీవాటా ఉంటే బిజెపి పాలిత ప్రాంతాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడిప్పుడే అభి వృద్ధి చెందుతున్న తెలంగాణను విచ్చిన్నం చేయ డానికి బిజెపి నాయకులు కుట్ర పన్నుతున్నారని, గుజరాత్ గులాంల ఆటలు తెలంగాణలో సాగని వ్వమని,మేము గుజరాత్ గులాంలంకాదనిచెప్పు లు మోసే సంస్కృతి మాకులేదని అన్నారు.నియో జకవర్గంలో ప్రతిఎకరాకు సాగునీరు అందుతుంద ని,ఇంకా15 గ్రామాలకు సాగునీరుఅందడం లేదని తన దృష్టికి రాగానే సీఎం కేసీఆర్ తో మాట్లాడటం జరిగిందని,వారం రోజుల్లోగా సాగునీటి కోసం100 కోట్లతో పనులు ప్రారంభించడంజరుగుతుందన్నా రు. నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల కావాల ని ఎమ్మెల్యే రాజయ్య చాలాసార్లు కోరడం జరిగిం దని, సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి రెసిడెన్షియ ల్ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని, వారం రోజుల్లోగా ప్రారంభించడం జరుగుతుంద న్నారు. 2014 నుండి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి పదంలోముందుందని అర్హులైన ప్రతి ఒక్కరికి దళితబంధు వస్తుందని అన్నారు.తె లంగాణ ప్రజలకు కావాల్సింది పంటల తెలంగాణ అని,మంటల తెలంగాణ కాదని అన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కెసిఆర్ నాయక త్వాన్ని ఆశీర్వదించాలన్నారు. నూతన సచివాల యానికి అంబేద్కర్ పేరుపెట్టడం పట్ల ముఖ్యమం త్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి రామ్ రెడ్డి, తాసిల్దార్ ఫుల్ సింగ్ చౌహాన్, ఏసీపీ రఘు చందర్,సీఐ ఎడ వెల్లి శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీడీవో కృష్ణ, ఎస్సై శ్రవణ్ కుమార్,ఏపీఎం కవిత, సీడీపిఓ ఫ్లోరేన్స్, నియోజ కవర్గ ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు , అంగన్వాడి టీచర్ లు, ఆశవర్కర్లు, ఐకెపి మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Attachments area